క్రీడాకారులకు టీ -షర్ట్స్ పంపిణీ
కేకే విరాట్ హాస్పిటల్ వైద్యులు
కరీంనగర్, మార్చి 25(విజయక్రాంతి): స్థానికంగా క్రీడాకారులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా కేకే విరాట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో టీషర్ట్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ స్వప్న (డీజీవో), డాక్టర్ సురేష్ గౌడ్ (యూరలాజిస్ట్) హాజ రయ్యారు. ఈ సందర్భంగా వారు క్రీడాకారులకు టీషర్ట్స్ అందజేస్తూ, క్రీడలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు.
యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని సూచించారు. డాక్టర్ స్వప్న మాట్లాడుతూ, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసికోల్లాసాన్ని కూడా పెంపొందిస్తాయన్నారు. డాక్టర్ సురేష్ గౌడ్ మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు క్రీడాకారులకు మరింత ఉత్సాహాన్ని నింపుతాయన్నారు. కార్యక్రమంలో మేనేజర్ గంగాధర్, మార్కెటింగ్ ఇన్‌చార్జి అందే రాజు, క్రీడాకారులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.




