25 March, 2026 | 2:08 AM

గురి కుదిరేనా ?

25-03-2026 12:00 AM
  1. ఫేవరెట్‌గా గుజరాత్ టైటాన్స్

కోర్ టీంను వదులుకోని ఫ్రాంచైజీ

గిల్ కెప్టెన్సీపై అంచనాలు

సమతూకంగా కనిపిస్తున్న జట్టు

ఐపీఎల్ చరిత్రలో తొలి సీజన్ నే ఘనంగా ఆరంభించిన జట్టు గుజరాత్ టైటాన్స్... ఢిల్లీ, పంజాబ్, ఆర్సీబీ వంటి జట్లు టైటిల్ కోసం నిరీక్షిస్తుంటే తాము ఎంట్రీ ఇచ్చిన ఆరంభ సీజన్‌లోనే ట్రోఫీ ఎగరేసుకుపోయింది. ఈ విజయం గాలివాటం కాదని నిరూపిస్తూ మరుసటి సీజన్‌లోనూ రన్నరప్‌గా నిలిచింది. హార్థిక్ పాండ్యా ముంబైకి వెళ్లిపోవడంతో తర్వాత తడబడినా ఇప్పుడు బలమైన జట్లలో ఒకటిగా కనిపిస్తోంది. మరి గుజరాత్ రెండో టైటిల్ గురి ఈ సారి కుదురుతుందా ?

అహ్మదాబాద్, మార్చి 24: ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రత్యేక గుర్తిం పు ఉంది. అడుగుపెట్టిన తొలి సీజన్‌లో నే అందరినీ ఆశ్చర్యపరుస్తూ సంచలన విజయాలతో ఛాంపియన్‌గా నిలిచింది. తర్వాతి సీజన్‌లో సైతం ఫైనల్‌కు దూసుకొచ్చి తృటిలో రెండో ట్రోఫీని చేజా ర్చుకుంది. ఓవరాల్‌గా సుధీర్ఘ కాలం నుంచి లీగ్‌లో ఉన్న జట్ల కంటే బలమైన జట్టుగా పేరు తెచ్చుకున్న గుజరాత్ టైటాన్స్ కథ హార్థిక్ పాండ్యా వెళ్లిన తర్వాత కాస్త మారినా తక్కువ సమయంలోనే మళ్లీ పుంజుకుంది. శుభమన్ గిల్ సారథ్యంలో రెండో టైటిల్ కోసం ఎదురుచూస్తున్న గుజరాత్ టైటాన్స్‌పై ఈ సారి అంచ నాలు బాగానే ఉన్నాయి.

మినీ వేలంలో గుజరాత్ పెద్దగా మార్పులేమీ చేయలేదు. తమ మ్యాచ్ విన్నర్లను కొనసాగిస్తూనే బెంచ్ ను పటిష్టం చేసుకుంది. గత సీజన్ జట్టునే కొనసాగించ డం గుజరాత్‌కు అడ్వాంటేజ్. వేలంలో ల్యూక్ వుడ్, టామ్ బాంటన్, జాసన్ హోల్డర్ వంటి విదేశీ ప్లేయర్స్‌తో పాటు తెలుగబ్బాయి పృథ్విరాజ్ యర్రాను కొనుగోలు చేసింది. గత సీజన్‌లో ఎక్కువ మంది ఆటగాళ్లే కంటిన్యూ అవుతుండడంతో తుది జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు.

గుజరాత్ బ్యాటింగ్ విభాగం లో గిల్, సాయి సుదర్శన్, బట్లర్ అత్యంత కీలకం. ఆ జట్టు భారీస్కోర్లకు ఈ ముగ్గురే కార ణం. నిలకడగా రాణిస్తూ గుజరాత్ బ్యాటిం గ్‌కు కీలకంగా ఉంటున్నారు. మంచి ఆరంభాలను ఇవ్వగలిగే సత్తా ఉన్న బ్యాటర్లు వీళ్లు. గత సీజన్‌లో సాయి సుదర్శన్ దుమ్మురేపాడు. 150కి పైగా స్ట్రైక్ రేట్ తో ఏకంగా 759 పరుగులు చేసిన సాయి ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు.

అలాగే గిల్ 650, బట్లర్ 538 పరుగులు చేశారు. ఈ త్ర యం చెలరేగితే గుజ రాత్‌కు తిరుగుండ దు. అటు బౌలింగ్‌లో రబా డ, ప్రసిద్ధ కృష్ణలతో పాటు హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ గుజరాత్‌కు కీలకంగా చెప్పొచ్చు. రబాడ పూర్తిస్థాయిలో చెలరేగితే మాత్రం ప్రత్యర్థి బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవు. అలాగే ప్రసిద్ధ కృష్ణ గత సీజన్‌లో 25 వికెట్లు తీశాడు. సిరాజ్ కూడా సత్తా చాటితే ప్రత్యర్థి జట్లను కట్టడి చేయొచ్చు. వేలంలో కొత్తగా తీసుకున్న ల్యూక్ వుడ్ కూడా అడ్వాంటేజ్ కానున్నాడు. 

మరోవైపు స్పిన్ విభాగంలో స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌తో పాటు సాయికిశోర్‌లపై అంచనాలున్నాయి. అయితే గత సీజన్‌లో రషీద్ ఖాన్ పెద్దగా ప్రభావం చూపలేకపోవడం గుజరాత్ అవకాశాలను దెబ్బ తీసింది. దీంతో ఈ సారి రషీద్ తన మ్యాజిక్ చూపిస్తాడని ఆశలు పెట్టుకుంది. ఇదిలా ఉం టే మిడిలార్డర్ నిలకడలేమి గుజరాత్ టైటాన్స్‌కు సమస్యగా మారింది.

టాప్ ఆర్డర్ రాణిస్తున్న మిడిలార్డర్‌లో నమ్మకం పెట్టుకునే బ్యాటర్లు లేకపో వడంతో భారీస్కోర్లు సాధించడం కష్టమే. ఈ సారి గ్లెన్ ఫిలిప్స్ , బాంటన్ వంటి వారిని మిడిలార్డర్‌లో ప్రయత్నించే అవకాశాలున్నాయి. అలాగే ఫినిషర్ రోల్‌ను తెవాటియా అనుకున్న స్థాయిలో పోషించలేకపోతుండడం కూడా సమస్యగా మారింది. హోల్డర్‌ను తీసుకున్నప్పటకీ తుది జట్టులో అతన్ని తీసుకోవ డం సవాలే. మొత్తం మీద టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా పేరున్న గుజరాత్ టైటాన్స్ అంచనాలకు తగ్గట్టు రాణిస్తే మాత్రం రెండో టైటిల్ గెలవొచ్చు.

గుజరాత్ టైటాన్స్ జట్టు

శుభ్మన్ గిల్, బట్లర్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ బాంటన్, కుశాగ్ర, అనుజ్ రావత్, వాషింగ్టన్ సుందర్, నిషాంత్ సంధు, అర్షద్ ఖాన్, సాయి కిశోర్, జయంత్ యాదవ్, హోల్డర్, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, రబాడ, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, ఇషాంత్ శర్మ, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, ల్యూవ్ వుడ్, పృథ్వీరాజ్ యర్రా, అశోక్ శర్మ.