26 March, 2026 | 2:49 AM

74వ బీఎన్ మల్లిక్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం

26-03-2026 12:00 AM
  1. యూనిఫాం వదిలి జెర్సీల్లో మైదానంలోకి దిగిన ఖాకీలు  
  2. పోలీసుల క్రమశిక్షణకు, దృఢత్వానికి క్రీడలే ప్రాణాధారం
  3. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా 
  4. జట్టు కృషి, వ్యూహాలకు ఫుట్‌బాల్ నిదర్శనం: డీజీపీ శివధర్‌రెడ్డి

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 25 (విజయక్రాంతి): ప్రతిష్ఠాత్మక 74వ బీఎన్ మల్లిక్ అఖిల భారత ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ 2025-26 గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ మెగా టోర్నీని ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర బలగాలకు చెందిన ఫుట్‌బాల్ జట్లు మార్చ్‌ఫాస్ట్ నిర్వహిస్తుంటే, గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ క్రీడలు కేవలం శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, క్రమశిక్షణకు, పోలీసు విధులకు ప్రాణ ధారమన్నారు.  యంగ్ ఇండియా స్పోర ట్స్ యూనివర్సిటీ వంటి కార్యక్రమాలతో తెలంగాణ క్రీడలకు కేంద్రంగా మారుతోందని ఆయన ప్రశంసించారు. డీజీపీ బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక ఛాంపియన్‌షిప్ హైదరాబాద్ వేదిక కావడం గర్వంగా ఉందన్నారు.

నిష్పక్షపాతంగా ఆడుతూ క్రీడాస్ఫూర్తిని చాటాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు.ఐజీ స్పోరట్స్ గజరావు భూపాల్ స్వాగతోపన్యాసం చేస్తూ.. తెలంగాణలో ఫుట్‌బాల్‌కు ఉన్న పాత వైభవాన్ని గుర్తుచేశారు.  సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ వందన సమ ర్పణ చేశారు. ఆర్బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, అదనపు డీజీపీలు సంజయ్ కుమార్ జైన్, అనిల్ కుమార్, డీఐజీ అభిషేక్ మహంతి తదితరులున్నారు.