11 July, 2026 | 12:23 PM

విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎస్‌జీటీ వెంకటేశ్వర్లు చేయూత..

11-07-2026 11:52 AM

ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు టేబుల్ బుక్స్ పంపిణీ

టేకులపల్లి, (విజయక్రాంతి): విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో టేకులపల్లి మండలంలోని కోయగూడెం ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో ఎస్‌జీటీ ఉపాధ్యాయులు బి. వెంకటేశ్వర్లు తన సొంత ఖర్చులతో 20 మంది ప్రాథమిక విద్యార్థులకు టేబుల్ బుక్స్ అందజేసి ఆదర్శంగా నిలిచారు. పాఠశాల ఉపాధ్యాయులు డి. నాగేశ్వరరావు చేతుల మీదుగా విద్యార్థులకు టేబుల్ బుక్స్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ చూపి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, అందించిన విద్యా సామగ్రిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయుడు బి. వెంకటేశ్వర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేసిన సేవా కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రశంసించారు. సమాజంలో విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హాము, రవికుమార్, కిషోర్ సింగ్, రమాదేవి, మోతిలాల్, భద్రూ, రమేష్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.