11 July, 2026 | 12:26 PM

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సదానందం కుటుంబాన్ని పరామర్శించిన దుద్దిళ్ల శ్రీను బాబు

11-07-2026 11:49 AM

ముత్తారం, జూలై 11(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, ముత్తారం మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం తండ్రి చొప్పరి లింగయ్య శుక్రవారం ఉదయం మృతి చెందడంతో, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా లింగయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన శ్రీను బాబు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సదానందం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. శ్రీనుబాబు వెంట ముత్తారం సింగిల్ విండో చైర్మన్ యాదగిరిరావు, మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, కమాన్‌పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వినీత్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల కిరణ్,  అజీమ్ ఖాన్, సూదాటి సంపత్‌రావు, స్వామి తదితరులు పాల్గొన్నారు.