calender_icon.png 17 July, 2025 | 11:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్షయ సమృద్ధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోధనా సామగ్రి పంపిణీ

16-07-2025 12:18:45 AM

మేడ్చల్ అర్బన్, జూలై 15:  మేడ్చల్ పట్టణంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అక్షయ స మృద్ధి ఫౌండేషన్ చైర్మన్ ములంగారి శ్రీహరి చారి ఆధ్వర్యంలో 350 మంది విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు పెన్సిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నా యకుడు పాతూరి సుధాకర్ రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకుడు మల్లికార్జున్ స్వామి మాట్లాడుతూ అక్షయ ఫౌండేషన్ పేద మధ్యతరగతి ప్రభుత్వ విద్యార్థి విద్యార్థిలకు ఉచితంగా నోట్ బుక్స్ పె న్సిల్ పెన్నులు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు.

మేడ్చల్ నగరంలో స్థానికంగా గత పదిహేను సంవత్సరాల నుండి శ్రీహరి చారి చలివేంద్రాం, వైకుంఠ రథాo నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు చేయడం ఇతరులకు మార్గదర్శనం అని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే తలచేవారు చాలామంది ఉంటారు. కానీ ఆచరణలో పెట్టే వాళ్ళు చాలా తక్కువ. సమాజంలో ఉన్న మనం సమాజ సేవ పనిచేసే వారికి ఆర్థికంగా అన్ని విధాల ఎంతో కొంత సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక స్కూల్ ప్రధాన ఆచార్యులు నాగేశ్వరరావు రాజశేఖర్ రావు సానాల విష్ణు చారి తాళ్లపల్లి శ్రీనివాస్ గుప్తా రాజు ప్రభుత్వ పాఠశాల అధ్యాపకులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.