16-07-2025 12:20:04 AM
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కోరిన స్థానికులు
ఎల్బీనగర్, జూలై 15 : నాగోల్ డివిజన్ పరిధిలోని అజయ్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు మంగళవారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పలు సమస్యలను సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా నూ తన డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయాలని, వర్షపునీరు వెళ్లడానికి ఔట్ లేట్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... అజయ్ నగర్ కాలనీని ప్రణాళికబద్దంగా అభివృద్ధి చేస్తానన్నారు.
శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ మంచినీటి సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. రోడ్ల నిర్మాణం, వర్షపునీరు నిలబడకుండా అధికారులతో చర్చించి తగు ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు. పార్టీలకతీతంగా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాగోల్ డివిజన్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, కాలనీవాసులు రామకృష్ణ, విఠల్ రావు, సం పత్ గుప్తా, వెంకటేశ్వర్, వాసుదేవరావు, బాలచంద్ర, రవికుమార్, గజ్జల అశోక్‌పాల్గొన్నారు.