6 June, 2026 | 9:04 PM

టేకులపల్లిలో విత్తన దుకాణాలను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి

06-06-2026 07:55 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రమైన టేకులపల్లిలో జిల్లా వ్యవసాయ అధికారి వి. బాబూరావు శనివారం విత్తన దుకాణాలను ఆకస్మిక తనికి చేశారు. విత్తన పాకెట్స్ ను స్కాన్ చేసి ప్రభుత్వం ధృవీకరణ చేసిన కంపెనీవా లేదా అని చూసి నిర్ధారించారు. అలాగే కంపెనీ లైసెన్స్ వెరిఫై చేసి విత్తన డీలర్స్ నాణ్యమైన విత్తనాలను రైతులకు ఇవాల్సినదిగా సూచించారు. రైతులు ఎవరు ఇతర రాష్ట్రాల నుండి విత్తనాలు తెచ్చుకోవద్దని లైసెన్స్ కలిగిన డీలర్ వద్దనే కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని అన్నపూర్ణ పాల్గొన్నారు.