8 April, 2026 | 9:30 PM

బెజ్జూర్ లో జిల్లా కలెక్టర్ హల్ చల్

08-04-2026 07:53 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ హరిత ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీ చేసి హల్ చల్ చేశారు. మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తహసిల్దార్ కార్యాలయం, గిరిజన ఆశ్రమ పాఠశాల, ప్రాథమిక ఉన్నత పాఠశాల ను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలు రికార్డులను పరిశీలించారు. సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 30 పడగల ఆసుపత్రి నిర్మాణ స్థలం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిరిజన ఆశ్రమం పాఠశాల తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఉన్నత పాఠశాలను భవనాలను పరిశీలించి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. తహసిల్దార్ కార్యాలయం ఆకస్మికంగా తనిఖీ చేసి పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల నివేదిక ఇవ్వాలని కోరారు.

వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని తహసిల్దార్ రామ్మోహన్రావుకు ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పెండింగ్ బిల్లుల వివరాలను ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట వైద్యులు శ్రావణ్ కుమార్, శ్రీనివాస్, వైద్య సిబ్బంది, గ్రామ సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి, ఉప సర్పంచ్ ఆదర్శ్, అధికారులు నాయకులు ఉన్నారు.