సామూహిక కుంకుమార్చన
08-04-2026 07:55 PM
కుబీర్,(విజయక్రాంతి): కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో శివాలయంలో హిందూ సమ్మేళనంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఈ కుంకుమార్చన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళ భక్తులు తరలివచ్చారు. స్వామి కమలానంద భారతి పూజారులు రాజు ఆధ్వర్యంలో పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్ట రవి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేష్ సదాశివ పటేల్ గ్రామ నాయకులు పాల్గొన్నారు




