వరి కొనుగోలు కేంద్రం, సత్య సాయి రైస్ మిల్ పరిశీలించిన జిల్లా కలెక్టర్
కొల్చారం,(విజయక్రాంతి): రైతులకు ఇబ్బందులు లేకుండా జిల్లాలో సాఫీగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని కొనుగోలుకు సంబంధించిన అన్ని సౌకర్యాలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్నాయని రవాణాలో జాప్యం లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు, అన్లోడింగ్ లో సమస్యలు తలెత్తుకుండా మిల్లర్లు సమన్వయంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు.సోమవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ కొల్చారం మండల కేంద్రంలోని ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ నగేష్, కొనుగోలు కేంద్ర నిర్వాహకులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటి వరకు జరిగిన ధాన్యం కొనుగోలు వివరాలు, గన్ని బ్యాగ్ లు సరిపడా పంపిస్తున్నారా లేదా?కేంద్రాలకు కేటాయించిన లారీలు వస్తున్నాయా? లేదా? అలాగే నమోదు అయిన ఓపీఎంఎస్ వివరాల గురించి కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కొల్చారం మండల కేంద్రంలో ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటివరకు 13 లారీల ధాన్యం ఈ సెంటర్ నుండి సత్య సాయి రైస్ మిల్లుకు తరలించడం జరిగిందని ఈ సెంటర్లో హమాలీల కొరత లేదని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సివిల్ సప్లై అధికారులు కొనుగోలు కేంద్రాలను తరచూ సందర్శిస్తూ రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమం లో ఎమ్మార్వో శ్రీనివాస చారి. సొసైటీ చైర్మన్ మనోహర్. సీఈవో కృష్ణ. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






