13 April, 2026 | 6:14 AM

ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

05-02-2026 03:41 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): గురువారం నాడు ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం భద్రతకు సంబంధించి ప్రతినెల తనిఖీ చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా గురువారం  సందర్శించడం జరిగిందని తెలిపారు. ఈ పరిశీలనలో భాగంగా  సీసీ కెమెరా గదిలో కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయన గోడౌన్  పరిసర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేనిదే ఎవరిని లోపలికి  అనుమతించరాదని అధికారులకు సెక్యూరిటీ గార్డ్ కు తెలిపారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లు సంతకం చేశారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట  ఎన్నికల సూపర్డెంట్ రంగ ప్రసాద్, ఎన్నికల సిబ్బంది నవీన్,  తదితరులు పాల్గొన్నారు.