రైతుల సంక్షేమంలో సహకార సంఘాల పాత్ర కీలకం
యూరియా వినియోగాన్ని తగ్గిస్తేనే నేల సంరక్షణ
భిన్న పంటలు సాగు చేసి రైతులు ఆర్థికంగా ఎదగాలి
ఆయిల్ పామ్ సాగుతో దీర్ఘకాలిక ప్రయోజనాలు
రైతు సంక్షేమ వారోత్సవాల్లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
గద్వాల టౌన్, మే 6: రైతులు ఒకే పంటను కాకుండా భిన్న పంటలు సాగు చేస్తే ఆర్థికంగా ఎదగవచ్చని, ఆయిల్ పామ్ సాగుతో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న రైతు సంక్షే మ వారోత్సవాల్లో బుధవారం గద్వాల పిఎసిఎస్ లో సహకార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
వ్యవసాయ రంగం అభివృద్ధి చెందేందుకు సహకార సంఘాల కృషి ఎంతో ఉందని, రైతుల సంక్షేమానికి రుణాలు ఇవ్వడం, సబ్సిడీకి విత్తనాలు, ఎరువులు అందజేయడం జరుగుతుందన్నారు. కొద్ది రోజుల కిందట జిల్లాలోనీ రైతులకు కొరత లేకుండా యూరియాను సరఫరా చేయడంలో ఆయా మండ లాల ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘాలు ప్రధాన పాత్ర పోషించాయని కొనియాడారు.
జిల్లాలో ఆయిల్ పామ్ సాగును పెంచేందుకు ప్రతి పిఎసిఎస్ కు 100 ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశించినందున సంఘాల సభ్యులు సాగు చేసేందుకు సహకరించాలన్నారు. గద్వాల పిఎసిఎస్ ఉత్పత్తిదారుల స హకార సంఘంకు ఎంపికవడంతో ప్రభు త్వం నుంచి ప్రత్యేక నిధులు రూ.15 లక్షలు మంజూరవడంతో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నేల ఆరోగ్యాన్ని కాపాడతామని అందరూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, పిఎసిఎస్ చైర్మన్ సుభాన్, గద్వాల మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్, జిల్లా కోపరేటివ్ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి వీరప్ప, ఎల్డిఎం శ్రీనివాసరావు, కోపరేటివ్ బ్యాంక్ మేనేజర్ ప్రదీప్ కుమార్, పిఎసిఎస్ సీఈవో వెంకటేశ్వర్ రెడ్డి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.






