22 July, 2026 | 5:43 PM

క్రమం తప్పకుండా కళాశాలకు రావాలి: డీఐఓ

22-07-2026 05:07 PM

బోథ్,(విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు రావాలని ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి జాదవ్ గణేష్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కళాశాలలో నిప్పులు రికార్డులను తనిఖీ చేయడం జరిగింది. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్య బోధించడం జరుగుతుందని భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.