30 June, 2026 | 11:54 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

గ్యాస్ సంక్షోభంపై జిల్లాస్థాయి కమిటీ

16-03-2026 01:14 AM
  1. అక్రమంగా విక్రయిస్తే భారీ జరిమానా, కేసు నమోదు 

రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి 

ఎల్బీనగర్, మార్చి 15 : రంగారెడ్డి జిల్లాలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ప్రజలు ఆందోళన చెందవద్దని, గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్లను అక్రమంగా విక్రయిస్తే భారీ జరిమానాతోపాటు  క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కే. చంద్రారెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు.

దీంతో పాటు అనేక గ్యాస్ ఏజె న్సీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలో అదనపు కలెక్టర్ ఆధ్వర్యం లో జిల్లాస్థాయి ఇంధన సరఫరా మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు.  జిల్లాలో ఎక్కడా గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా, ప్రజలకు సరిపడినంత గ్యాస్ సిలిండర్ల సరఫరా చేయడానికి మానిటరింగ్ కమిటీ చర్యలు తీసుకుంటుంది. 

వదంతులు నమ్మొద్దు..

 రంగారెడ్డి జిల్లా అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఎలాం టి సమస్యలు లేవు. ప్రజలు భయాందోళనకు గురై అదనపు సిలిండర్ల బుక్ చేస్తున్నా రు. జిల్లాలో ఎక్కడా ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా జిల్లాస్థాయి ఇంధన సరఫరా మానిటరింగ్ కమిటీ ఏర్పా టు చేశాం. బహిరంగ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ల విక్రయిస్తే భారీ జరిమానా, క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి.