30 June, 2026 | 10:57 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఇండ్ల గణనను పకడ్బందీగా నిర్వహించాలి

16-03-2026 01:15 AM

రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్

రంగారెడ్డి, మార్చి 15(విజయక్రాంతి): 2027 జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా మొదటి దశలో చేపట్టే ఇండ్ల గణన  కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ కె. శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ కార్యాలయంలో తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి ఇండ్ల గణన కార్యక్రమాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ పద్ధతిలో నిర్వహిస్తారని,ఎన్యూమరేటర్లు నేరుగా ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరిస్తారని చెప్పారు.మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు.. మున్సిపల్ స్థాయిలో కమిషనర్లు, మేనేజర్లు చార్జ్ అధికారులుగా వ్యవహరిస్తూ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు.

మూడు రోజుల పాటు మార్చి 15, 16, 17 జరిగే ఈ శిక్షణలో మాస్టర్ ట్రైనర్లు వివరించే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలని, సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. సెన్సెస్ ఇండెక్స్ పుస్తకాన్ని అవగాహన చేసుకుని, ఎలాంటి తప్పులు దొర్లకుండా పక్కాగా ఇండ్ల జాబితాను రూపొందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, సిపిఓ సౌమ్య, జెడ్పి సీఈవో కృష్ణారెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.