16 March, 2026 | 5:23 AM

ఐఐసీటీలో ఘనంగా మహిళా దినోత్సవం

16-03-2026 01:13 AM

సికింద్రాబాద్, మార్చి15(విజయక్రాంతి): మహిళలపై సమాజంలో ఉన్న  వివక్షతను పూర్తి స్థాయిలో తొలగించిన పుడే వారికి సరైన గౌరవం దక్కుతుందని మాజీ ఐఏఎస్ అధికారి,సీఎస్ బీ ఐఏఎస్ అకాడమి డైరెక్టర్ బాలలత మల్లవరపు పేర్కొన్నారు. పని ప్రదేశాలలో మహిళలకు సురక్షితమైన, గౌరవప్ర దమైన, వృత్తిపరమైన వాతా వరణాలను నిర్ధారించాల్సిన అవసరాన్ని ఉందన్నారు. తార్నాకలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడు కలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఆమె  పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నివారణ ఫ్రేమ్వర్క్ గురిం చి అవగాహన ప్రాముఖ్యతను వివరించారు. చిన్న తన నుంచి తాను ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్గా ప్రస్తుతపదవిని సాధించడం వరకు తన స్ఫూర్తిదా యకమైన ప్రయాణాన్ని పం చుకున్నారు. వ్యక్తిగత వైకల్యాలను అధిగమించడం గురించి ఆమె మాట్లాడుతూ విజ యానికి అవసరమైన క్రమశిక్షణ, దృఢ సం కల్పాన్ని కలిగి ఉండాలని, తద్వారా ఎంచుకున్న లక్ష్యాన్ని సునాయంగా చేరుకుం టామన్నారు.

ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ శాస్త్రీ య పర్యావ రణ వ్యవస్థను బలోపేతం చేయడంలో, సైన్స్, టెక్నాలజీ ద్వారా సామాజిక సవాళ్లను పరిష్క రించ డంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారని ఆయన చెప్పారు. శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్ల డంలో మహిళా శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సిబ్బంది చేసిన గణనీయమైన సహకారాన్ని అంది స్తున్నారని, ఐఐసీటీ సంస్థ పురోభివృద్దిలో మహిళల పాత్ర ఎంతో ఉందన్నారు. నాయకత్వంపరిశోధన తీసుకునే ప్రక్రియలలో మహిళలు ఎక్కువగా పాల్గొనాలని ఆయన సూచించారు.

సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ వసుందర చీపురుపల్లి మాట్లాడుతూ మహిళల ఆరోగ్యంలో క్రమంతప్పకుండాఆరోగ్య పరీక్షలు చేయించుకో వాలన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉన్నపుడేఆయా కుటుంబాలు సంతోషంగా ఉంటా యన్నారు. మహిళల్లో  అండాశయతిత్తులు, ఫైబ్రోసిస్కు సంబంధించిన యువతలో ఇటీవలి కేస్ స్టడీలను ఆమె పంచు కున్నారు.ఈ కార్యక్రమం డాక్టర్ ఎస్. శ్రీలత, ఐఐసీటీ శాస్త్రవేత్తలు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.