21 July, 2026 | 8:39 PM

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

21-07-2026 06:17 PM

జిల్లా వైద్యాధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్

పాపన్నపేట: వర్షాకాలంలో డెంగీ, మలేరియా, చికున్ గున్యా, టైఫాయిడ్, డయేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్ సూచించారు. మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. సీజనల్ వ్యాధులు, దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు సైతం ఎక్కడ నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దన్నారు. స్థానిక వైద్యాధికారి అన్వర్, సిబ్బంది చందర్ తదితరులున్నారు.