21 July, 2026 | 10:17 PM

Breaking News

బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలి

21-07-2026 08:24 PM

నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్‌లో యువజన కాంగ్రెస్ ఫిర్యాదు

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులపై ఎల్‌బీ నగర్‌లో నిర్వహించిన యువ సదస్సులో బీఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ, వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాగిరెడ్డిపేట మండల యువజన కాంగ్రెస్ నాయకులు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్సై భార్గవ్ గౌడ్‌కు ఫిర్యాదు చేశారు.ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు ఫిర్యాదు చేసినట్లు నాగిరెడ్డిపేట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మేకల ప్రశాంత్ తెలిపారు.బీఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వెంటనే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,లేనిపక్షంలో ఆందోళనలు,రాస్తారోకోలు నిర్వహిస్తామని  హెచ్చరించారు.