21 July, 2026 | 10:03 PM

Breaking News

అర్హులందరికి ఓటు హక్కు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

21-07-2026 08:18 PM

టీపిసీసీ కో ఆర్డినేటర్ సిరాజ్ హుస్సేన్, డీసీసీ అధ్యక్షులు బట్టు కర్ణాకర్

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): అర్హులందరికి ఓటు హక్కు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం అని టీపిసీసీ కో ఆర్డినేటర్ సిరాజ్ హుస్సేన్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక పరిశీలన కార్యక్రమాన్ని మంగళవారం భూపాలపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో భాగంగా టీపీసీసీ కో ఆర్డినేటర్, డీసీసీ అధ్యక్షులు 14, 15, 18, 19, 20వ బూతులను సందర్శించి బీఎల్‌ఏల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి బీఎల్‌ఏ ఒక సైనికుడిలా పనిచేయాలని అన్నారు. ప్రతి బీఎల్‌ఏ ప్రతిరోజు కనీసం 25 ఇండ్లను సందర్శించి ఓటర్ల వివరాలను నమోదు చేయాలని అన్నారు. అందులో భాగముగా కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి వివరాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలను సేకరించాలని, పూర్తి చేసిన దరఖాస్తులను వెంటనే సంబంధిత బీఎల్‌వోకు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో ఆర్డినేటర్ మోటోజి కిష్టయ్య, వార్డు కౌన్సిలర్ పోనగంటి మేఘన శ్రీను, పరమేశ్వరి, వెంకట్ యాదవ్, కో ఆప్షన్ సభ్యులు సజ్జనపు స్వామి, ప్రేమ్ కిషోర్, కోమల, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.