calender_icon.png 18 June, 2025 | 11:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివీస్ ల్యాబ్ లాభం 21 శాతం వృద్ధి

04-08-2024 02:03:35 AM

హైదరాబాద్, ఆగస్టు 3: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా కంపెనీ దివీస్ లాబొరెటరీస్ కన్సాలిడేటెడ్ నికరలాభం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో 20.79 శాతం వృద్ధిచెంది రూ. 356 కోట్ల నుంచి రూ. 430 కోట్లకు పెరిగింది. కంపెనీ ఆదాయం 19.12 శాతం వృద్ధితో రూ. 2,118 కోట్లకు చేరింది. పన్నుకు ముందు లాభం 22.76 శాతం పెరిగి రూ.492 కోట్ల నుంచి రూ. 604 కోట్లకు పెరిగింది. స్టాండెలోన్ ప్రాతిపదికన కంపెనీ నికరలాభం 24.64 శాతం వృద్ధితో రూ.430 కోట్లకు చేరగా, ఆదాయం 19.25 శాతం వృద్ధిచెంది రూ. 2,063 కోట్ల వద్ద  నిలిచింది.