15 June, 2026 | 2:43 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

44వ డివిజన్ సమస్యలు పరిష్కరించాలి: పొనిశెట్టి

25-02-2026 12:53 AM

పాల్వంచ, ఫిబ్రవరి 24, (విజయక్రాంతి): 44వ డివిజన్ పరిధిలో నెలకొన్న పారిశుద్ధ్యం/డ్రైనేజీ/వీధి లైట్లు/ తాగునీటి సమస్యలపై బిజెపి అధికార ప్రతినిధి పోలిశెట్టి వెంకటేశ్వర్లు మంగళవారం పాల్వంచ డివిజన్ కార్యాలయంలో మేనేజర్ సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాల్వంచ పట్టణంలోని 44 వ డివిజన్ లో గల శ్రీనగర్ కాలనీ, గాంధీ నగర్ కాలనీలలోని చాల ప్రాంతలలో గత కొంతకాలంగా అనేక సమస్యలు కొనసాగుతున్నాయన్నారు. చెత్త సక్రమంగా తొలగించడం లేదనీ, డ్రైనేజీ కాలువలు మూసుకుపోయి దుర్గంధం వెదజల్లుతోందని ,డ్రైనేజి కాలువలు శుభ్రం చెయ్యడం లేదనీ, అనేక చోట్ల వీధి లైట్లు వెలగడం లేదనీ తక్షణమే వాటిని మరమత్తు చెయ్యాలి లేని యడల వాటి స్థానం లో కొత్తవి ఏర్పాటు చెయ్యాలనీ డిమాండ్ చేశారు.

తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని,  కొన్ని ఏరియాల్లో గత పది రోజుల నుండి తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయిందన్నారు. 44 వ డివిజన్ లో గాంధీనగర్ లో మున్సిపల్ స్థలం ఆక్రమణకు గురిఅవుతుందన్నారు .ఆ స్థలం లో మున్సిపల్ స్థలం  బోర్డు పెట్టలని డిమాండ్ చేశారు. దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు అనారోగ్య దారిన పడుకున్నారని దోమల నివారణ తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో లింగగిరి వెంకట్రామయ్య, చింతల చెర్వు శేఖర్,కొత్తపల్లి విజయ్, గార్లపాటి కిరణ్, బానోత్ బాలాజీ, జర్పుల లాలు, బానోత్ రోషన్ లు పాల్గొన్నారు.