18-02-2026 08:54:18 PM
- కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు
ముకరంపుర,(విజయక్రాంతి): 50 డివిజన్ ప్రజలు తనపై విశ్వాసం, నమ్మకంతో మున్సిపల్ ఎన్నికల్లో అందించిన విజయం జీవితంలో మర్చిపోలేనిదని, డివిజన్ ప్రజల రుణం తీర్చుకోలేనిదని, డివిజన్ సమగ్రాభివృద్ధి కోసం కృషిచేసి ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తానని డివిజన్ కార్పొరేటర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు అన్నారు.
బుధవారం ఆయన 50వ డివిజన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా డివిజన్ సమగ్రాభివృద్ధి కోసం శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు.