మంత్రి శ్రీధర్ బాబు మేనత్తకి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు
31-07-2026 07:31 PM
మంథని,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు మేనత్త అయిన కీ.శే• సువర్ణ వనమాల ఇటీవల కాలంలో మరణించడంతో శుక్రవారం ద్వాదశ దినకర్మ సందర్బంగా మంథని కేంద్రంలోని వారి నివాసంలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం తన ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలిపారు. అనంతరం మంథని కేంద్రంలోని శివకిరణ్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సువర్ణ మాల సంతాప కార్యక్రమంలో విజయరమణ రావు పాల్గొన్నారు. అనంతరం మంథని కేంద్రంలోని శివకిరణ్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సువర్ణ మాల సంతాప కార్యక్రమంలో విజయరమణ రావు పాల్గొన్నారు.






