calender_icon.png 17 October, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహేష్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లో దీపావళి మిలన్

17-10-2025 12:39:18 AM

హైదరాబాద్, అక్టోబర్ ౧౬(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ ౧౨లో ఉన్న ఏపీ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో బుధవారం ‘దీపావళి మిలన్’ నిర్వహించారు. మరో మూడు రోజుల్లో రానున్న ధన్‌తేరాస్ లేదా ధన త్రయోదశి, దీపావళి పండుగల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ యాజమాన్యం ధన్‌తేరాస్, దీపావళి పండుగల శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేశారు.

అలాగే నిర్వహించిన మ్యూజికల్ ప్రోగ్రాంలో పలువురు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ ఎండీ, సీఈవో వి.అరవింద్, చైర్మన్ రమేశ్ కుమార్ బంగ్, వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ్ రతి, ఇతర బ్యాంక్ డైరక్టర్లు, వారి కుటుంబ సభ్యులు తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.