calender_icon.png 18 October, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి

17-10-2025 12:27:34 AM

  1. హెల్మెట్ పెట్టుకోవాలి
  2. ఏడాదిలో 1,320 మంది ప్రమాద బాధితులకు కామినేని హాస్పిటల్ సేవలు
  3.   24 గంటలూ అందుబాటులో అత్యవసర వైద్యం
  4. ప్రపంచ ట్రామాడే సందర్భంగా కామినేని వైద్యుల వెల్లడి

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాం తి): ద్విచక్రవాహనాలు వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలని కామినేని ఆస్పత్రి వైద్యులు సూచించారు. నిరుటితో పోలిస్తే ఈ ఏడాదిలో ఇప్పటివరకు ప్రమాదాల సంఖ్య ఎక్కు వగానే ఉందని, ఎక్కువగా 25- ఏళ్ల మధ్యవారు ఈ ప్రమాదాల్లో గాయపడుతుండటం ప్రమాదకర సంకేతమని హెచ్చ రించారు. ప్రపంచ ట్రామా డే (అక్టోబర్ 17) సందర్భంగా ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి క్రిటికల్ కేర్ విభాగం వైద్యులు గురువారం మాట్లాడారు.

ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ మెడిసిన్, ఎమర్జెన్సీ విభాగాధిపతి డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ 2024- కేవలం తమ ఆస్పత్రికే 1,320 కేసులు వచ్చాయన్నారు. వీటిలో చాలావరకు బైక్ నడుపుతూ ప్రమాదాలకు గురైనవాళ్లే ఉంటున్నారన్నారు. బైక్ నడిపేవారితోపాటు వెనక కూర్చునేవారు కూడా హెల్మెట్లు ధరించాలి. హెల్మెట్ ఉంటే ఒకవేళ ప్రమాదానికి గురైనా మెదడు చాలావరకు సురక్షితంగా ఉంటుంది.

అప్పుడు ప్రాణాపాయం సంభవించే అవకాశాలు తక్కువ అని పేర్కొన్నారు. కన్సల్టెంట్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ డాక్టర్ పైళ్ల నవీన్‌రెడ్డి మాట్లాడుతూ, “కామినేని ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితుల్లో చికిత్స చేసేందుకు అన్ని సదుపాయా లూన్నాయి. మా దగ్గర ప్రత్యేకంగా ట్రామా బృందం ఒకటి ఉంటుంది. 24 గంటల్లో ఏ సమయంలోనైనా ప్రమాదానికి సంబంధించిన కేసు వస్తే వెంటనే ఎమర్జెన్సీలో చేర్చి, అప్పటికప్పుడు చేయాల్సిన చికిత్సలు చేస్తుంటారు.

అదే సమయంలో కార్డియాక్ సర్జరీ, ఆర్థోసర్జరీ, న్యూరోసర్జరీ, జనరల్ సర్జరీ ఇతర విభాగాలకు చెందిన వైద్యులందరూ కూడా వచ్చి వెంటనే పరీక్షించి ఏదైనా శస్త్రచికిత్స చేయాల్సి వస్తే తక్షణమే థియేటర్‌కి తరలిస్తాన్నారు. 24 గంటలు పనిచేసే బ్లడ్ బ్యాంక్ కూడా ఉంటుంది. అందువల్ల అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సి వచ్చినా ఇబ్బం ది ఉండదు. ఎల్బీనగర్ నుంచి నల్లగొండ వరకు ఎక్కడ తీవ్ర రోడ్డు ప్రమాదాలు సంభవించినా చాలావరకు కామినేనికే తీసుకొస్తా రన్నారు.

ప్రమాదం జరిగినప్పుడు వెంటనే అక్కడ ఉన్నవారు చేసే ప్రథమచికిత్స చాలా ముఖ్యం. అందుకోసం మా అంబులెన్సు డ్రైవర్లు, అందులోని టెక్నికల్ సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తున్నామన్నారు కార్యక్రమంలో క్రిటికల్ కేర్ విభాగానికి చెందిన డాక్టర్ శృంగల దేవీజన్, క్రిటికల్ కేర్, ఎక్మో విభాగానికి చెందిన డాక్టర్ బి. కిషన్ సింగ్ కూడా పాల్గొన్నారు.