17-10-2025 12:54:56 AM
హైదరాబాద్, అక్టోబర్ 16(విజయక్రాంతి) :హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవోటెల్‌లో హైబిజ్ టీవీ నిర్వహించిన హెల్త్ కేర్ అవార్డ్స్, 5వ ఎడిషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా జరిగింది. హెల్త్ కేర్ రంగంలో అసాధారణ సేవలు అందించిన వైద్యులు, ఆస్పత్రులు, సంస్థలు, ప్రత్యేక వ్యక్తులను ఈ అవార్డులతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే టీ.హరీశ్‌రావు హాజరయ్యా రు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ‘భారతదేశ హెల్త్ కేర్ వ్యవస్థ దేశ ప్రగతిలో కీలకమైందన్నారు. ఈ అవార్డ్స్ ద్వారా గుర్తించబడిన సేవలు దేశ ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. హైదరాబాద్ హెల్త్ అండ్ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా హబ్ గా మారిందని, విదేశీయులు సైతం ఇక్కడికి వైద్యం కోసం వస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణలో హెల్త్ కేర్ రంగం అభివృద్ధికి ఉత్తమ డాక్టర్లు చేసిన సేవలు ముఖ్యమైనవని, ఈ అవార్డులు వారి కృషికి స్ఫూర్తినిస్తాయన్నారు.
వైద్యరంగంలో నిజాయితీతో పనిచే సిన వారికి గొప్ప గుర్తింపు ఉంటుంది అని అన్నారు. మరో అతిథి తెలంగాణ హోమ్ విభాగం స్పెషల్ సెక్రటరీ సీవీ ఆనంద్ ఐసీఎస్ మాట్లాడుతూ సామాన్యులకు అందు బాటులో వైద్యం ఉన్నప్పుడే వైద్య సేవకు పరిపూర్ణ అర్ధం అని అన్నారు. కాగా అతిథుల సమక్షంలోనే పలు కేటగిరీల్లో అవార్డు లు ప్రదానం చేయబడ్డాయి. హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ రంగంలో ఉత్తమ సేవలు అం దించిన వారికి వివిధ కేటగిరీల్లో 50కి పైగా అవార్డులు ప్రదానం చేశారు.
ముఖం గా ఈ రంగంలో దీర్ఘకాలికమైన సేవలు అందించిన డాక్టర్ హరి ప్రసాద్, డాక్టర్ కెఎన్ సుధా రమణలకు లెజెండరీ పురస్కారాలు అందాయి. ప్రభుత్వాస్పత్రి సూపరిం టెండెం ట్లు డాక్టర్ ఎన్ వాణి, డాక్టర్ బీరప్ప నగరి, డాక్టర్ రాకేష్ సహాయ్, డాక్టర్ విజయ్ కుమార్లకు స్పెషల్ జ్యూరీ అవార్డులు ప్రధా నం చేశారు. ఈ కార్యక్రమంలో హైబిజ్ టీవీ సంస్థ ఫౌండర్, ఎమ్‌డీ మాడిశెట్టి రాజగోపాల్ మాట్లాడుతూ ‘ఈ అవార్డులు భవిష్య త్‌లో మరిన్ని ఆవిష్కరణలకు ప్రేరణగా నిలుస్తాయి’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేణు వినోద్, ఏఐజీ హాస్పిటల్స్ డైరెక్టర్ డా.జీవీ రావు, ఆర్‌ఈ సస్టైనబిలిటిటీ ఎగ్జిక్యూటీవ్ వైస్ చైర్మన్ గౌతమ్ రెడ్డి మెరెడ్డి, కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డా.ఆదర్శ్ అన్నపరెడ్డి, పల్స్ ఫార్మసుటికల్స్ డైరెక్టర్ దివ్య మైనేని, కన్వర్జ్ బయోటెక్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ బిజ్జెళ్ల, క్రెడాయ్ మాజీ ప్రెసిడెంట్ వి. రాజశేఖర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.