కాలుష్యానికి చెక్.. ఆరెండ్లుగా మట్టి గణపతికి వెల్‌కమ్..!

15-09-2026 | 11:45am

ఆరెండ్లుగా పూజలు అందుకుంటున్నమట్టి వినాయకుడు

భక్తి పాటలు భజనలతో నిమజ్జనం

శబ్ద కాలుష్యం నీటి కాలుష్యం ఉండదు

బోథ్ సెప్టెంబర్ 14(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలోని రామాలయంలో ప్రతి ఏడాది ప్రతిష్టాపించే గణనాథుడు మట్టితో తయారుచేసి నీటి కాలుష్యం లేకుండా ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. గత ఆరు సంవత్సరాల కారణంగా ఇదే విధమైన గణనాథుడిని నిమజ్జనం కావిస్తున్నారు.

ఆదర్శంగా ఉండాలని

గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు గొల్లపల్లి రమేష్ ఓస, శ్రీనివాసులు మొదట అందరికీ ఆదర్శవంతంగా ఉండాలన్న ఉద్దేశంతో మట్టి గణపతిని ప్రతిష్టాపించాలన్న ఆలోచనకు వచ్చారు. రమేష్ అనే ఉపాధ్యాయుడు గణపతిని చేసేందుకు ముందుకు వచ్చాడు. గడ్డి మట్టిని కలిపి గణనాథుని తయారుచేసి ప్రతిష్టాపిస్తూ వస్తున్నారు. అయితే మట్టి గణపతి ప్రతిష్టాపన పలువురికి ఆదర్శంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. రామాలయంలో గణపతిని ప్రతిష్టాపించాలన్న అదుర్గంతో మొదట నుండి అక్కడే ప్రతిష్టాపించడం జరుగుతుందన్నారు. కేవలం భక్తికి సంబంధించిన పాటలను పాడుతూ డీజే కు దూరంగా ఉండేలా నిమజ్జనం కావిస్తున్నారు. 

కాలుష్య రహిత గణనాథులను ప్రతిష్టాపించండి

నీటి కాలుష్యం శబ్ద కాలుష్యం లేకుండా గణపతులను ప్రతిష్టాపించి పండుగ వాతావరణాన్ని ఆదర్శవంతంగా జరుపుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. వివిధ రకాల రంగులతో ఏర్పాటుచేసిన గణపతి విగ్రహాలతో నీటి కాలుష్యం డీజే లతో శబ్ద కాలుష్యం పెరగడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. ఆదర్శవంతంగా ఉండాలన్న దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు