3 June, 2026 | 1:57 AM

కర్ణాటక సీఎంగా నేడే డీకే ప్రమాణ స్వీకారం

03-06-2026 01:13 AM
  1. 10 మంది ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం
  2. బెంగళూరులో భారీ బందోబస్తు

బెంగళూరు, జూన్ 2: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీ.కే. శివకుమార్ బుధవారం ప్రమాణ స్వీకరాం చేయనున్నారు. ఆయనతోపాటే మరో పది మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. సమీప వర్గాలు వెల్లడించాయి. మంత్రుల స్థానంలో కేజే జార్జ్, రామలింగారెడ్డి, కేబీ గౌడ, యూటీ ఖాదర్, ఎం.బీ.పాటిల్, సతీష్ జార్కిహోలి, ప్రియాంక్ ఖర్గే, యతీంద్ర, లక్ష్మీ హెబ్బాల్కర్‌లకు స్థానం దక్కే అవకాశం ఉంది. కాగా ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ఉండే అవకాశం ఉంది.

కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ చేపట్టనున్న ఈ ప్రమాణ స్వీకారానికి పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అగ్రనాయకులు, వీఐపీలు, వీవీఐపీలకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. బుధవారం సాయంత్రం 4.05 గంటలకు లోక్‌భవన్‌లో డీకే ప్రమాణం చేపడతారు. ప్రమాణ స్వీకారం అనంతరం డీకే శివకుమార్ లోక్ భవన్ నుంచి విధానసౌధ వరకు ఓపెన్‌టాప్ జీపులో రోడ్‌షో నిర్వహిస్తారు.