3 June, 2026 | 1:54 AM

సైబర్ దాడికి యత్నించారు

03-06-2026 01:09 AM
  1. సీబీఎస్‌ఈ బోర్డు వెల్లడి
  2. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందు విద్యార్థి ప్రజంటేషన్

న్యూఢిల్లీ, జూన్ 2: సీబీఎస్‌ఈపై సైబర్ దాడి యత్నాలు జరిగాయని మంగళవారం బోర్డు వెల్లడించింది. డీవోఎస్ విధానంతో దరఖాస్తు చేసుకున్న 16వేల మందిలో కొందరు సైబర్ దాడికి ప్రయత్నించారని తెలిపింది. పోర్టల్‌లోకి లాగిన్ అయ్యేందుకు 15 లక్షల మంది ప్రయత్నించారని, లక్షకుపైగా అనధికారికంగా ప్రవేశించడానికి ప్రయత్నించారని సిస్టమ్ గుర్తించిందని పేర్కొంది

పోర్టల్ పనిచేస్తుందని దరఖాస్తులను ప్రాసెస్ చేస్తున్నా మని, ఒకేసారి 8వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకునే సామర్థ్యం ఉందని వెల్లడించింది. అంతరాయం లేకుండా తమ బృందాలు కృషి చేస్తున్నారని పేర్కొంది. కాగా ఓఎస్‌ఎం విధానంతో ప్రభావితమైన విద్యార్థుల్లో ఒకరైన సార్థక్ (18) విద్యార్థి పార్లమెంటరీ స్టాండింగ్ ప్యానెల్ ముందు హాజరయ్యారు. టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని కమిటీకి తెలిపారు.