22 July, 2026 | 6:33 PM

ఉపాధ్యాయులకు ముగిసిన శిక్షణ

22-07-2026 06:02 PM

నిర్మల్,(విజయక్రాంతి): విద్యార్థులకు కృత్యాధార బోధన చేయడం వలన అభ్యసన శిక్షణ తరగతులు ఉపాధ్యాయులకు బుధవారం ముగిశాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా లెక్చర్ పద్దతులకు బదులుగా కృత్యాధార పద్ధతులతో పాటు TLM (టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్)తో బోధన చేయడం వలన విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలను సాధించవచ్చునని శిక్షకులు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం లోని నారాయణ స్కూల్ లో జరుగుతున్న బయో సైన్స్ టీచర్ల శిక్షణ  ముగింపు సమావేశంలో లో టీచర్లను ఉద్దేశించి ZPHS పాత ఎల్లాపూర్ PG హెడ్ మాస్టర్ కోర్స్ డైరెక్టర్ రమాదేవి తెలిపారు. 

మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో లిప్,స్కూల్ లైబ్రరీ,డిజిటల్ పద్ధతిలో పాఠాల బోధన,వర్క్ బుక్ వినియోగం,స్కూల్ సేఫ్టీ మరియు బొమ్మల ద్వారా విద్యార్థులకు ఎలా బోధన చేయలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ లో  నిర్మల్ జిల్లా నేషనల్ గ్రీన్ కోఆర్డినేటర్ మోహన్ రావు మరియు నిర్మల్ జిల్లా బయో సైన్స్ ఫోరం ప్రెసిడెంట్ రాపెల్లి సత్యం, జనరల్ సెక్రటరీ సుష్మ రాణి డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ గంగసురేష్, సుభాష్, శంకర్, విజయ్ కుమార్ లు పాల్గొన్నారు.  ఈ శిక్షణ లో నిర్మల్ (అర్బన్ & రూరల్, మామడ, లక్ష్మణ్ చందా, ఖానాపూర్, కడెం, పెంబి, దస్తూరాబాద్, నర్సాపూర్ మండలాలకు చెందిన బయో సైన్స్ టీచర్లు పాల్గొన్నారు.