26 May, 2026 | 6:55 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

హయత్‌నగర్‌లో డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ

13-02-2026 12:00 AM

ఎల్బీనగర్, ఫిబ్రవరి 12 : ప్రభుత్వ దవాఖానల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ లలితా దేవి సూచించారు.  గురువారం హయత్ నగర్ వార్డు కార్యాలయం పరిధిలోని అర్బన్ ప్రైమరీ సెంటర్ , హయత్ నగర్ బస్తీ దవాఖాన , రంగనాయకుల గుట్టలోని యూపీహెచ్‌సీ,  బస్తీ దవాఖాన, మునగనూరులోని బస్తీ దవాఖాన, యూపీహెచ్‌సీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేయాలని ఆదేశించారు.