calender_icon.png 13 February, 2026 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడే రిజల్ట్

13-02-2026 12:00:00 AM

మున్సిపాలిటీ పీఠం ఏ పార్టీ పాగా.....? 

చైర్మన్ పీఠం కు బిజెపి, స్వతంత్రుల మద్దతు ఎవరి వైపు...? 

ఎన్నికల పోలింగ్ ముందు గంటన్నర కరెంట్ పోవడం వెనుక ఆంతర్యమేమో....? 

కార్యకర్తల ముందు మేకపోతు గాంభీర్యం.. లోలోపల మదనపాట్లు 

గెలిస్తే సంబురాలు.... గెలువక పోతే ప్రత్యర్థి మీద విమర్శలు చేసేందుకు సిద్ధం 

ఎన్నికల ప్రచారంలో నువ్వా నేనా అంటూ ధీటుగా ప్రచారం చేసిన సందర్బంలో మేమే గెలుస్తాం మనం భయపడాల్సిన అవసరం లేదు అంటూ ప్రజల ముందు ప్రగాభాలు పలికిన నేతలు నేడు రిజల్ట్ తారుమారు అయితే ప్రత్యర్థి నేతలపై విమర్శలు చేసేందుకు గాను ప్రణాళికలు సిద్ధం చేసుకోగా మున్సిపాలిటీ పీఠం ను ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో నేడు సాయంత్రం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. 

వనపర్తి, ఫిబ్రవరి 12 ( విజయక్రాంతి) : ఎన్నికల ప్రచారంలో నువ్వా నేనా అంటూ ధీటుగా ప్రచారం చేసిన సందర్బంలో మేమే గెలుస్తాం మనం భయపడాల్సిన అవసరం లేదు అంటూ ప్రజల ముందు ప్రగాభాలు పలికిన నేతలు నేడు రిజల్ట్ తారుమారు అయితే ప్రత్యర్థి నేతలపై విమర్శలు చేసేందుకు గాను ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

 మున్సిపాలిటీ పీఠం ఏ పార్టీ పాగా.....? 

వనపర్తి మున్సిపాలిటీ పీఠం పై అటు అధికార, ప్రతి పక్ష పార్టీలు ఎవరు పాగా వేస్తారన్నది ప్రశ్నర్థంకంగా మారింది. ఏ పార్టీ సైతం మున్సిపాలిటీ పీఠం పై పాగా వేయాలన్న బీజేపీ, స్వత్రంత్ర అభ్యర్థుల మద్దత్తు తప్పనిసరిగా మున్సిపాలిటీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ తెలుపుతున్న నేపథ్యంలో ఎవరు ఎవరికీ మద్దత్తు తెలుపుతారు అన్న విషయం వనపర్తి మున్సిపాలిటీ చర్చనీయంగా మారింది. అటు బిజెపి సైతం అధ్యదిక స్థానాలు గెలుస్తుందని, పార్టీ టికెట్ ఆశించి టికెట్ రాకపోయే సరికి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలోకి దిగారు ఈ నేపథ్యంలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు ఆయా పార్టీలకు మద్దతు తెలుపుతారా లేక ఇతర పార్టీలకు మద్దతు తెలుపుతారా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి. 

కార్యకర్తల ముందు మేకపోతు గాంభీర్యం.... లోలోపల మదనపాట్లు

మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికారికంగా వార్డు కౌన్సిలర్ అభ్యర్థి లక్ష రూపాయల లోపు మాత్రమే ఖర్చు పెట్టాలన్న నిబంధన ఉన్నప్పటికీ దాదాపుగా వార్డులో 20 లక్షల పైగానే ఖర్చు పెట్టారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎన్నికల ప్రచార నేపథ్యంలో ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా నువ్వా నేనా అంటూ ప్రచారాలు చేస్తూ తామే వార్డులో గెలుస్తామని ప్రచారాలను జోరుగా నిర్వహించారు.

ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అనంతరం పోలింగ్ శాతాన్ని అంచనా వేసుకుంటూ కార్యకర్తలు నిరాశకు లోను కాకుండా ఉండేందుకు వారి ముందు ఆయా పార్టీల వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థులు మేకపోతు గాంభీర్యంను ప్రదర్శిస్తూ లోలోపల మాత్రం అంచనాలు తారుమారైతే పరిస్థితి ఏంటి అని మదనపాట్లు పడుతున్న సందర్భాలు సైతం ఉన్నాయ్ అంటూ ప్రజలు బహిర్గతంగా చర్చించుకుంటున్నారు. 

 ఎన్నికల పోలింగ్ ముందు గంటన్నర కరెంట్ పోవడం వెనుక ఆంతర్యమేమో....? 

 రేపు ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలింగ్ రోజు తెల్లవారుజామున మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు ( దాదాపుగా గంటన్నర ) వనపర్తి పట్టణ మొత్తం కరెంటు పోవడం వెనుక ఆంతర్యం ఏమిటో ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆ గంటన్నర వ్యవధిలో ఆయా వార్డులో పెద్ద ఎత్తున ఓటింగ్ కు నగదు చొప్పున పంపిణీ చేశారంటూ పంపిణీకి కరెంటు ఎక్కడ అడ్డమవుతుందోనన్న నేపథ్యంలో పంపిణీకి కరెంటు బందుకు ఏదో సంబంధం ఉందంటూ అటు నాయకులు ఇటు ప్రజలు బహిర్గతంగా చర్చించుకుంటున్నారు.

సంబంధిత అధికారులకు నేతలు ఫోన్ చేసిన క్రమంలో పైనుంచి కరెంటు సమస్య ఏర్పడినందున కరెంటు తీయడం జరిగిందంటూ అంతకుమించి ఏమీ లేదని సమాధానం వచ్చినట్లు ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు.