19 March, 2026 | 6:02 AM

న్యాయంచేయరా దేవుడా..

19-03-2026 12:00 AM

సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుశీ భాస్కర్ నిర్మిస్తున్నారు. ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది.

ఈ చిత్ర మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మేకర్స్ ఇటీవలే ప్రారంభించారు. ‘న్యాయం చేయరా దేవుడా..’ అంటూ సాగే ఫుల్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ తాజాగా ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ నటించిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, సునీత ఆలపించారు. మహావీర్ ఎల్లంధర్ స్వరాలు సమకూర్చారు.