ఎన్నికల సంఘం ఆదేశానుసారంగా హెల్ప్ డెస్క్ ప్రారంభం
23-06-2026 08:29 PM
బోధన్,(విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో సారు-2026 లో భాగంగా, బోధన్ ఆర్డిఓ ఎం విజయ కుమారి బోధన్ అసెంబ్లీ నియోజికవర్గం లోని ఎలక్షన్ సెల్ వద్ద, ఎన్నికల సంఘం అదేశాను సారంగా, హెల్ప్ డెస్క్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోధన్ ఆర్డిఓ మాట్లాడుతూ...హెల్ప్ డెస్క్ సదుపాయాన్ని ప్రజలందరూ సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. సర్-2026 ప్రక్రియ లో, ప్రజలకు తలెత్తుతున్న సందేహాలు, సమస్యల ను పరిష్కరించటం లో, హెల్ప్ డెస్క్ కీలకం గా మారుతుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ తహసీల్దార్స్ పి. విఠల్ , సీనియర్ అసిస్టెంట్ సుశీల ఆపరేటర్ ముస్తఫా, తదితర సిబ్బంది పాల్గొన్నారు.






