26 May, 2026 | 3:14 PM

వ్యవసాయ వ్యర్థాలను కాల్చకండి: ఏవో

26-05-2026 02:43 PM

బోథ్,మే 26 (విజయక్రాంతి): రైతులు వ్యవసాయ వ్యర్థాలను కాల్చవద్దని సోనాల మండల వ్యవసాయ అధికారి గుగులోత్ దేవా నాయక్ పేర్కొన్నారు. వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవులు చనిపోతాయన్నారు అంతేగాక భూసారం దెబ్బతిని పంటలు దిగుబడి తగ్గిపోతుందన్నారు పర్యావరణానికి హాని కలిగించకుండా వ్యవసాయ వ్యర్థాలను భూమిలో కలిసే విధంగా చూడాలని ఆయన కోరారు. ఇటీవల జరుగుతున్న అగ్ని ప్రమాదాలు వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్లనే జరుగుతున్నాయన్నారు. పంట వ్యర్థాలను భూమిలో కలిసే విధంగా చేసినట్లయితే ఎరువుగా మారి రసాయనిక ఎరువులను వాడకుండా దిగుబడి పొందవచ్చు అన్నారు,