రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ తోరణం మార్చొద్దు
వరంగల్, మే29(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం మార్చవద్దని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ కళలు, చరిత్రను మరిపించే కుట్రలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్ర చిహ్న ంలో మార్పులను నిరసిస్తూ బుధవారం వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో పాల్గొన్న వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యతిరేక శక్తులు సీఎం వెనక ఉన్నాయని ఆరోపించారు. కేసీఆర్ మూలంగానే తెలంగాణ ఆదాయం పెరిగిందని చెప్తూ రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.
రాష్ట్ర అధికారిక చిహ్నం సరిగా లేదంటున్న సీఎం.. మార్పు కోసం ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ కమిటీలు, సబ్‌కమిటీలు వేయలేదని విమర్శి ంచారు. చంద్రబాబు, రేవంత్ గురుశిష్యులని, తెలంగాణ చరిత్ర, ఉద్యమం గురించి మాట్లాడే హక్కు రేవంత్‌రెడ్డికి లేదన్నారు. కాకతీయుల తోరణం పాలనా వైభవాన్ని చాటుతుందని చెప్పారు. 800 ఏండ్లు పాలించిన కాకతీయ రాజులు బడుగుబలహీన వర్గాల కోసం ఎంతో చేశారని పేర్కొన్నారు.
ఇప్పటికైనా రాష్ట్ర చిహ్నం విషయంలో సీఎం పునరాలోచించుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సారయ్య, మాజీ ఎమ్మె ల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థులు సుధీర్‌కుమార్, రాకేశ్‌రెడ్డితోపాటు పలువురు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






