19 May, 2026 | 1:45 AM

కేబీఆర్ పార్కు పరిధిలో చెట్లను నరకొద్దు

19-05-2026 12:45 AM
  1. సుప్రీం కోర్టు ఆదేశం
  2. పార్కు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంపై విచారణ
  3.   1300 చెట్లను నరికేస్తున్నారని పిటిషన్
  4. తదుపరి విచారణ జూలై 27కు వాయిదా

న్యూఢిల్లీ, మే 18: హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు వద్ద ఫ్లుఓవర్ నిర్మాణంపై సోమ వారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తదుపరి విచారణ వరకు చెట్లను కొట్టేయొద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్కు పరిధిలో పర్యావరణ సున్ని త ప్రాంతంలో 25 నుంచి30 మీటర్ల పరిధిలో ఉన్న చెట్లను కొట్టేయొద్దని ఆదేశిం చింది. ఈ పనుల కోసం పార్కు పరిధిలో సుమారు 1,300 చెట్లు నరికేస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వివేక్‌రెడ్డి వాదిం చారు.

ప్రణాళిక ఏమైనా ఉందా? చెట్లు తొలగించకుండా నిర్మించవచ్చా? అని న్యాయ స్థానం ప్రశ్నించింది. అలాంటిదేమి లేదని న్యాయవాది వివేక్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. వాస్తవానికి ప్రభుత్వమే చెట్లను తొలగిస్తోందని.. రాత్రి, పగలు తేడా లేకుండా చెట్లు నరుకుతున్నారని వివరించారు. పర్యావరణ సున్ని ప్రాంతంలో చెట్లు నరకొద్దని అభివృద్ధి బోర్డు చెప్పిందన్నారు. వాదనల అనంతరం ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ను జులై 27కి వాయిదా వేసింది.