15 May, 2026 | 3:51 AM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జాప్యం చేయవద్దు

15-05-2026 01:33 AM

జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

నిర్మల్ మే 14 ( విజయక్రాంతి)ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఆలస్యం చేయవద్దని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, మండలాల వారిగా అనుమతులు లభించిన ఇండ్లు, ప్రారంభించిన నిర్మాణాలు, అటవీ నిబంధనల వల్ల ఆగిన ఇండ్లు, తదితర అంశాలు సమీక్షించారు.

తమ పరిధిలో ఉన్న అటవీ అంశాల పరిష్కారానికి అటవీ అధికారులు కృషి చేయాల న్నారు. ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీడీవోలు ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి దరఖాస్తులు పరిశీలించి, అర్హత ఉన్న దరఖాస్తులను పై దశకు పంపించాలని అన్నారు. ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురవుతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడి, ఇండ్ల నిర్మాణాలు వెంట వెంటనే పూర్తి చేసేలా వారిని ప్రోత్సహించాలని తెలిపారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, ఖానాపూర్ ఫారెస్ట్ డివిజనల్ అధికారి రేవంత్ చంద్ర, హౌసింగ్, ఫారెస్ట్ అధికారులు, ఎంపీడీవో లు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.