15 May, 2026 | 3:50 AM

షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

15-05-2026 01:33 AM

నిర్మల్, మే 14 (విజయక్రాంతి): నియోజకవర్గంలోని నిర్మల్ రూరల్ 147, నిర్మల్ పట్టణం 344 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్ళ్ళున ఆడబిడ్డలకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామంటూ ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అటకెక్కించారని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇస్తామన్న హామీలను నెరవేర్చాలని ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నాయకులు జమాల్, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, కౌన్సిలర్లు గంజి రాజు, శ్రీరామోజీ నరేష్, కూన శశాంక్, సాత్విక్,జింక సూరి, ఖమ్మం సురేందర్, అర్జున్, విట్టల్, ఈశ్వర్ తో పాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు.