మద్యం సేవించి వాహనాలు నడపొద్దు
తాడ్వాయి, ఏప్రిల్, 13( విజయక్రాంతి): మద్యం సేవించి వాహనాలు నడపవద్దని తాడువాయి ఎస్‌ఐ నరేష్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో ఆయన సోమవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అనే అంశంపై నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని వివరించారు.ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని కోరారు. గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలన్నారు.
గ్రామాల నుంచి బయట ప్రదేశాలకు, గ్రామాలకు వెళ్లిన సమయంలో పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించి వెళ్లాలని సూచించారు. ఈ మధ్య దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలతో ఆయన ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా మండలంలోని ఎర్ర పహాడ్, నందివాడ,దేమికలాన్, కన్ కల్, కరడుపల్లి, కృష్ణాజివాడి, బ్రహ్మాజీ వాడి, సంగోజు వాడి, చందాపూర్ గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు,కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.






