6 May, 2026 | 2:49 AM

ప్రైవేట్ మిల్లర్ల దగ్గరకు వెళ్లి మోసపోకండి

06-05-2026 01:33 AM

రైతులకు టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి 

సదాశివపేట/కొండాపూర్, మే 5 : సదాశివపేట, కొండాపూర్ మండలాల్లో మంగళవారం టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పర్యటించారు.  సదాశివపేట పట్టణంలోని మార్కెట్ కమిటీలో, నందికంది, కొండాపూర్ మండలంలోని మారేపల్లి, కొండాపూర్, తేర్పొల్, గొల్లపల్లి, మాల్కాపూర్ లలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రైవేట్ మిల్లర్ల దగ్గరకు వెళ్ళి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దనే అమ్మాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.  పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కొనుగోలు కేంద్రాల్లో సన్న బియ్యం అమ్మితే క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ వస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిడిసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి,  మార్కెట్ కమిటీ చైర్మన్ అలివేని నర్సింహ రెడ్డి, వైస్ చైర్మన్ కంది కృష్ణ, సదాశివపేట మున్సిపల్ చైర్మన్ అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్  చిరు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సిద్దన్న, వ్యవసాయ శాఖ అధికారులు, ఆయా మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.