మన పార్టీ జెండా బండారి రంగు
కల్వకుంట్ల కవిత
జగదేవపూర్, మే 5 : జగదేవపూర్ మండల పరిధిలోని పలుగడ్డ గ్రామంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ, పోచమ్మ, నబిషిలా బొడ్రాయి, గ్రామ దేవతల ఉత్సవాలకు మాజీ ఎమ్మెల్సి తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఏస్) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసారు. ఆలయ నిర్వాహకులు ఆమెకు పట్టు వస్త్రాలు పెట్టారు.
అనంతరం మాట్లాడుతూ పార్టీ పెట్టిన తరువాత మొదటి సారి గజ్వెల్ నియోజకవర్గంలో అడుగు పెట్టగానే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దర్శనం, అనంతరం ముదిరాజ్ ల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకోవడం సంతోషం అన్నారు. ఈ సందర్బంగా మన పార్టీ రంగు బండారి (పసుపు)అని నుదిట్టిన పెట్టిన బొట్టు బండారి అని వ్యాఖ్యణించారు.
తెలంగాణలో రాబోయే కాలంలో ముదిరాజ్ లకు టీఆరెఎస్ పార్టీ పెద్ద పిటా వేస్తుంది అని గజ్వెల్ లో కొట్టాల యాదగిరి అందరికి అందుబాటులో ఉంటారన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి,సర్పంచ్ కనుకయ్య,గ్రామ పెద్దలు తాజా మాజీ సర్పంచ్ రాజేశ్వరి రవి,రామచంద్రం, ఇస్తారీ, వెంకటయ్య,గువ్వా రమేష్, ఎల్లేష్, వార్డు సభ్యులు నర్రా కృష్ణ,ఆయా గ్రామాల సర్పంచ్ లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.






