2 May, 2026 | 7:07 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

ప్రజావాణి అర్జీలు పెండింగ్ లో పెట్టవద్దు

09-03-2026 08:25 PM

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

ప్రజావాణికి 179 దరఖాస్తుల రాక

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ప్రజావాణి అర్జీలు పెండింగ్ లో పెట్టవద్దని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 179 దరఖాస్తుల రాగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి.. వాటిని పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

రెవెన్యూ శాఖకు 53, గృహ నిర్మాణ శాఖకు 29, డీఆర్డీఓ – 20, సంక్షేమ శాఖకు – 14, జిల్లా పంచాయతీ కార్యాలయం, ఎండీ సెస్ – 12, ఉపాధి కల్పన శాఖ, వైద్య శాఖ, ఈఈ పీఆర్ కు చొప్పున – 04, పౌర సరఫరాల శాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కు మూడు చొప్పున - 03, విద్యా శాఖ, ఈఈ ఆర్ అండ్ బీ, నీటి పారుదల శాఖ, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల, మిషన్ భగీరథకు రెండు చొప్పున, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, జిల్లా ప్రణాళిక అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి, ఎక్ష్సైజు శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, డీపీఆర్ఓ, పశు సంవర్ధక శాఖ, ఎస్పీ కార్యాలయానికి ఒకటి చొప్పున వచ్చాయి. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయి తదితరులు పాల్గొన్నారు.