2 May, 2026 | 8:50 PM

Breaking News

అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •   ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •   బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •   అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు   •   మాల్ తుమ్మెదలో.. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన స్వరూప కాటం   •  

ప్రజాపాలనలో చేపట్టబోయే పనులు పక్కాగా చేయాలి: ఎంపీడీవో

09-03-2026 08:19 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా మండలంలోని బొల్లారం గ్రామంలో గల నర్సరీ, పల్లె ప్రకృతి వనం, సిసి రోడ్లు, డ్రైనేజ్, పరిసరాల పరిశుభ్రత పనులను ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ సోమవారం పరిశీలించారు. అలాగే గ్రామంలో ప్రారంభించనున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపిటివో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా గ్రామాలలోని చేపట్టబోయే పనులన్నీ విధి నిర్వహణతో సక్రమంగా చేపట్టాలన్నారు.

ప్రజాపాలన కార్యక్రమంలో చేపట్టబోయే పనుల్లో ఎలాంటి నాణ్యత లోపం పనుల పట్ల ఆశ్రద్ధ చేయకూడదన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో చేపట్టబోయే ప్రతి పని పక్కాగా చేయాలన్నారు. అలాగే లింగంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఈజిఎస్ పనులను కూడా పరిశీలించారు. ఎండాకాలం సందర్భంగా గ్రామాలలో అంతగా పని ఉండదు కనుక పీజీఎస్ పనులకు హాజరై ఉపాధి పొంది రోజు 307 పొందాలన్నారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి సంతోష్ కుమార్,ఫీల్డ్ అసిస్టెంట్లు ఫర్వీణ బేగం, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.