10 March, 2026 | 2:36 AM

సుల్తానాబాద్ ఆర్యవైశ్య భవన్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

09-03-2026 08:35 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యం లో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు, ఈ సందర్భంగా  మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత తో పాటు పలువురు కౌన్సిలర్లను, మహిళా కానిస్టేబుల్ లను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు బాదం వాణి, సెక్రెటరీ రామిడి లత, కోశాధికారి కొమురవెల్లి చంద్రకళ తోపాటు  పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు, మహిళా దినోత్సవ సందర్భం గా మహిళల ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ  సంబరాలు జరుపుకున్నారు.