21-01-2026 05:41:15 PM
సర్పంచ్ అరుణ కిషన్ రావు
మోతె,(విజయ క్రాంతి): మైనర్ పిల్లలకు పెళ్లిళ్లు చేయవద్దని, 18 సంవత్సరాలు నిండిన తరువాతే పెళ్లిళ్లు చేయాలని సర్పంచ్ వాసంశెట్టి అరుణ కిషన్ రావు అన్నారు. బుధవారం మండల పరిధిలోని మామిళ్ళ గూడెం, తుమ్మల పల్లి, గ్రామాలలో జిల్లా లీగల్ సర్వీస్ ఆధారిటి, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వయస్సు రాక ముందే పెళ్లిళ్లు చేస్తే ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు వస్తాయని కుటుంబాలలో అనేక సమస్యలు వస్తాయని తెలిపారు.
చాటు మాటుగా పెళ్లిళ్లు చేస్తే చట్ట పరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మామిళ్ళగూడెం గ్రామ సర్పంచ్ కొరివి నాగమణి వీరాస్వామి, గ్రామ కార్యదర్శి లు సతీష్ రెడ్డి, సంతోష్, జిల్లా లీగల్ సర్వీస్ ఆధారిటి స్వచ్ఛంద కార్యకర్తలు గుద్దేటి వెంకన్న, పల్లెల లక్ష్మణ్, యస్ కృష్ణ వేణి, ఉపసర్పంచులు వెంకట్ రెడ్డి, లింగారెడ్డి, అంగన్వాడీ టీచర్ ఉమ, ఆశ కార్యకర్త సుభద్ర తదితరులు పాల్గొన్నారు.