21-01-2026 05:33:09 PM
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్రి సతీష్
మోతె,(విజయక్రాంతి): కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగిస్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్రి సతీష్ మాదిగ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాజేష్ మృతికి కారణమైన బాధ్యులను కాపాడుతున్న కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు జిల్లా లో జరుగుతున్న పరిణామాలకు పూర్తి భాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఈ నెల 24న కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కి వినతిపత్రం అందజేస్తామని, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. 25 న రాజేష్ చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తామని, ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 3 వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాజేష్ మృతికి కారణమైన వారికి సహకరిస్తున్న ఎస్పీ, డిఎస్పీ ల పైన చట్ట పరమైన చర్యలు చేపట్టే వరకు ఉద్యమిస్తామని చెప్పారు.