19 June, 2026 | 4:10 PM

విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు: బిఆర్ఎస్ జిల్లా నాయకుడు కట్ట మల్లేష్ గౌడ్

19-06-2026 02:17 PM

వేములపల్లి,(విజయక్రాంతి):  విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేసి రేవంత్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని బిఆర్ఎస్ జిల్లా నాయకుడు కట్ట మల్లేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం శెట్టిపాలెం గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసారన్నారు.

తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత కెసిఆర్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థుల పట్ల కర్కశంగా ప్రవర్తిస్తూ జీవో 8, 9 లను ప్రవేశపెట్టి గత మూడు సంవత్సరాల నుండి రియంబర్స్మెంట్ ఇవ్వక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మూడు సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేసి పథకాన్ని పాత పద్ధతిలోనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.