28 August, 2026 | 2:09 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

మున్నూరు కాపు సంఘం సుల్తానాబాద్ మండల కన్వీనర్‌గా గొట్టం మహేష్

19-06-2026 03:48 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ మున్నూరు కాపు సంఘం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కన్వీనర్‌గా పట్టణానికి చెందిన గొట్టం మహేష్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కన్వీనర్ పెంట రాజేష్  నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండల స్థాయిలో సంఘ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించడంతో పాటు మున్నూరు కాపు సామాజిక వర్గ ఐక్యత, అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా నూతన మండల కన్వీనర్ గొట్టం మహేష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామంలో మున్నూరు కాపు సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు యువత, విద్యార్థులు, మహిళలను సంఘ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తానని పేర్కొన్నారు. సామాజిక, విద్యా, ఆర్థిక రంగాల్లో మున్నూరు కాపు వర్గ అభ్యున్నతికి సంఘం ద్వారా నిరంతరం సేవలు అందించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.

సంఘం ఆశయాలు, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమిష్టిగా పనిచేస్తూ మండలంలో సంఘానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర కన్వీనర్లు, జిల్లా నాయకులు, సంఘ సభ్యులు, శ్రేయోభిలాషులకు గొట్టం మహేష్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, సభ్యులు, యువ నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొని గొట్టం మహేష్‌కు అభినందనలు తెలియజేసి, ఆయన నాయకత్వంలో సంఘం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు..